జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభించిన హిందువులు



ఉత్తర ప్రదేశ్: వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులో కింది భాగంలో ప్రాచీన శివాలయం ఉందని, దానిని నేలమట్టం చేసి మసీదు నిర్మించారనే వాదనతో  హిందూ సంఘాలు 1991న  కోర్టును ఆశ్రయించారు. తరువాత 2019 లో న్యాయవాది విజయ్ శంకర్ రాస్తోగి తిరిగి ఆ పిటిషన్ ను పునరుద్ధరించారు. ఆధారాల కోసం సైంటిఫిక్ సర్వే చేయమని అధికారులను కోర్ట్ ఆదేశించింది.  దీనిపై కోర్టుకు ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని సాక్షాధారాలు సమర్పించడం జరిగింది. వాదోపవాదనలు విన్న తర్వాత వారణాసి కోర్టు బుధవారం (జనవరి 31, 2024) న హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతులను ఇస్తూ తీర్పునిచ్చింది. వారం రోజుల్లో జిల్లా యంత్రాంగం ఎటువంటి సమస్య లేకుండా పూజలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.

కోర్టు వారం రోజులు గడువు విధించినప్పటికీ, బుధవారం రాత్రి 10.30 గంటలకు సెల్లార్ తెరిచి పూజలు నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ చైర్మన్ నాగేంద్ర పాండే తెలిపారు. హిందూ శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో అర్చకులతో పూజలు నిర్వహించారు.

ఈ పూజలకు సంబంధించిన ఒక వీడియో, ఫోటోలను హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. హిందువుల వైపు వాదనలు వినిపించిన ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు విష్ణు శంకర్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది  హిందువులందరూ భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొనవచ్చునని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post