మాల్దీవులకు పాకిస్థాన్ ఆర్థిక సహాయం : ప్రధాని అన్వర్ హామీ

 


అసలే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్తాన్, మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మాల్దీవులు అభివృద్ధికి తాము అండగా ఉంటామంటూ పాకిస్తాన్ ప్రధాని అన్వర్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో ఫోన్లో గురువారం సంభాషించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా వారు ఇరువురు అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహాయ సహకారాలపై చర్చించారు.

అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ ఇటీవల 2 బిలియన్ డాలర్ల రుణం కావాలని చైనా ను  కోరింది. అంతేకాక పాక్ ఆర్థిక సమస్యల కారణంగా ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ని కూడా విక్రయించాలని ఆలోచిస్తుంది. 

అయితే ఇటీవల భారత్, మాల్దీవుల మధ్య వివాదాల నేపథ్యంలో భారత్, మాల్దీవులకు అందించే ఆర్థిక సహకారం సహాయం పైన కూడా కొంత కోతను విధించింది. గత ఏడాది సుమారు 770.90 కోట్లు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని, ఈ ఆర్ధిక సంవత్సరం 2024-25 నకు 600 కోట్లకు కుదించింది. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా పొరుగు దేశాలలో రక్షణ, విద్య, వైద్యం, మౌలిక వసతులు వంటి వాటి అభివృద్ధి కోసం మాల్దీవులు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంది. ఇన్ని ఆర్ధిక సమస్యల మధ్య పాకిస్తాన్ ఏ మేరకు మాల్దీవులకు సహాయం చేయగలదో వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post