పదవీ విరమణ తర్వాతి జీవనానికి ఎందుకు ప్లాన్ చెయ్యాలి?
ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి. ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకు ఉండే గౌరవం, హోదా తర్వాత కూడా ఉండాలని కోరుకోవడం సహజం. కానీ వయసు రీత్యా, ఇంట్లో కనీస గుర్తింపు కూడా లేనివారు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ పక్కన పెడితే మనం అనుకున్నట్టు స్వతంత్రంగా మన పదవీ విరమణ తర్వాతి జీవితం ఉండాలంటే ఖచిత్తంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
ఎందుకు ప్రణాళిక అవసరం?
పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గుతుంది, ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు పెరుగుతుంది. దీనితో పాటు రోజు రోజుకి నిత్యావసరాల ధరలు, విలాసాలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రణాళికా బద్ధంగా ఉంటేనే జీవనం సాఫీగా ఉంటుంది.
పదవీ విరమణ కోసం ప్లాన్ చేయడానికి మీరు అనుసరించగల కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెన్షన్ ప్లాన్ : ప్రభుత్వ / ప్రభుత్వ రంగ మరియు నమ్మికగల సంస్థలనుండి పొదుపు, పెన్షన్ ప్లాన్ వంటి పథకాలను తీసుకోవడం మంచిది.
ఆరోగ్య భీమా : ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది ఉద్యోగులు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు తప్పకుండా చేయాల్సిన భీమా. మన ఆరోగ్య విషయంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో ఎవరికీ తెలియదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనం దాచుకున్న డబ్బు ఆరోగ్య రక్షణకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి అవి కూడా చాలకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. కావున తప్పకుండా ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ఆరోగ్య భీమా తీసుకోవడం ఉత్తమం.
పెట్టుబడి : ఉద్యోగం చేస్తున్నప్పుడే కొంత మొత్తాన్ని ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా నమ్మకమైన సంస్థలలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై అవగాహన లేదా అనుభవం లేని వారు బంగారంపై పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ లేకుండా లాభాలు పొందవచ్చు.
పదవీ విరమణ లక్ష్యాలను నిర్ణయించండి : మీరు కోరుకున్న జీవన విధానం, ఎక్కడ, ఎలా నివసించాలనుకుంటున్నారు అనే విషయాలు అలోచించి, ఖర్చు అంచనా వేసుకోండి.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి : మీ రిటైర్మెంట్ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఎంత పొదుపు చేయాలో నిర్ణయించుకోండి. దానికి మీ ప్రస్తుత ఆదాయం, అప్పులు, పెట్టుబడులు మరియు పొదుపుపై ఒక అవగాహన ఏర్పరచుకోండి.
వ్యక్తిగత ప్రయోజనాలను ఉపయోగించుకోండి : ఏదయినా నమ్మికగల సంస్థ నుండి పెన్షన్ ప్లాన్ వంటి ప్రాయోజిత పథకాలను ఎంచుకొని, వీలైనంత మరియు అనుమతించబడిన గరిష్ట మొత్తాన్ని కేటాయించండి.
మీ ప్రణాలికను తరచుగా సమీక్షించండి మరియు సర్దుబాటు చేయండి : మీ ఆర్థిక పరిస్థితి మరియు పదవీ విరమణ లక్ష్యాలు కాలక్రమేణా మారవచ్చు, కాబట్టి మీరు అనుకున్న విధంగా లక్ష్యాలను చేరుతున్నదీ లేనిదీ నిర్ధారించుకోండి. అవసరమైన సర్దుబాట్లు చేసుకోండి.
ఆర్థిక నిపుణుల సలహా తెసుకోండి : సమగ్ర పదవీ విరమణ ప్రణాళికను రూపొందించడంలో మీకు సహాయపడటానికి మరియు మీకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి ఆర్థిక సలహాదారుని సంప్రదించడానికి ప్రయత్నించండి.
చివరిగా, పదవీ విరమణ తర్వాత పొదుపు చాలా అవసరం, అది కూడా హుందాగా ఉండాలి. అంటే అనవసర ఖర్చులు తగ్గించుకొని, కుటుంబ పోషణకు, పిల్లలకు, ఆరోగ్య అవసరాలకు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ఉత్తమం.