అద్దె ఇంటిని ఎంచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

 

Tips on choosing an affordable rented house

ఇంటిని అద్దెకు తీసుకోవడంలో ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి?

ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది వృత్తి , వ్యాపారాలు, ఉద్యోగ రీత్యా అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు సర్వ సాధారణం. అంతేకాక గ్రామీణ ప్రాంతాల నుండి పిల్లల చదువుల కోసం కూడా చాలా మంది పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. దీనివల్ల పట్టణాలలో అద్దె ఇళ్ళలో నివసించే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. మధ్య తరగతి వారికి వారి ఆర్ధిక పరిస్థితికి తగిన ఇల్లు దొరకటం కూడా అవసరమే. అద్దెతో పాటు మంచి నీరు, కరెంటు, రోడ్డు, రవాణా, స్కూల్ / కాలేజ్, హాస్పిటల్ వంటి సౌకర్యాలు కూడా తప్పనిసరి. ఇవన్నీ బాగా ఉంటే అద్దె కూడా పెరుగుతుంది. కాబట్టి కొన్ని తప్పనిసరి సౌకర్యాలను పరిగణించి మిగిలిన వాటిలో కాస్త సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంటుంది. ఈ సౌకర్యాలను ఎంచుకొనే విషయంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

1. స్థానం : వృత్తి / వ్యాపారం, పాఠశాలలు, షాపింగ్ మరియు రవాణాకు అనుకూలంగా, సమీపంలో ఉన్న ఇంటిని పరిశీలించండి.


2. బడ్జెట్ : ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు కేటాయించిన బడ్జెట్‌కు మించకుండా ఉండేలా ఎంచుకోండి. ఎందుకంటే అద్దెతో పాటు ఇతర ఖర్చులైన మెయింటెనెన్సు, యుటిలిటీ ఖర్చులు, పార్కింగ్ ఫీజులు కూడా పరిగణనలోకి తీసుకోండి.


3. సౌకర్యాలు : వాహనాల పార్కింగ్, మంచినీరు, డ్రైనేజీ వంటి మీకు ముఖ్యమైన సౌకర్యాలను పరిగణించండి.


4. పరిమాణం : మీకు అవసరమైన గదుల సంఖ్యను అంచనా వేసుకోండి. అవసరంలేని అదనపు గదుల వల్ల అద్దె పెరుగుతుంది. కాబట్టి ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులకు సరిపోయేంత గదులున్న ఇంటిని ఎంచుకోవచ్చు.


5. భద్రత : ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. మనకు తెలియని కొత్త ప్రదేశమైతే ముందుగానే ఆ ప్రాంతం గురించి తెలుసుకోండి. వయసులో పెద్దవారైతే ఈ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు వహించాలి.


6. ఇంటి యజమాని : ఇంటి యజమాని మంచివారై ఉండాలి. చిన్నచిన్న విషయాలకు ఇబ్బంది పెట్టేవారు కాకుండ ఉంటే మంచిది. వారితో స్నేహ బంధం వుండెలా మనం ప్రవర్తించాలి.


7. తనిఖీ : లీజుపై సంతకం చేసే ముందు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి సమయాన్ని వెచ్చించండి. ఏదైనా నిర్వహణ లేదా మరమ్మత్తు సమస్యల కోసం తనిఖీ చేసిన తర్వాతనే నిర్ధారించుకోండి.


8. లీజు నిబంధనలు : లీజు వ్యవధి, రెన్యువల్ మరియు లీజును రద్దు చేసేందుకు సంబంధించిన నిబంధనలను జాగ్రత్తగా సమీక్షించండి.

Post a Comment

Previous Post Next Post