క్యారెట్
ఎలా తినాలి? ఎందుకు తినాలి?
కారెట్ అనేది దుంప
జాతికి చెందిన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. ఇవి మంచి రుచిని కలిగి
ఉండటం వల్ల చాలా మంది పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడతారు. క్యారెట్‌లో పోషకాలు,
విటమిన్లు మరియు
ఫైబర్ పుష్కలంగా ఉన్నందున రక్తహీనతను తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి
తరచుగా క్యారెట్‌లను తినాలని ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు సూచిస్తున్నారు.
క్యారెట్‌లో
ఏమేమి పోషకాలున్నాయి?
క్యారెట్‌లో
విటమిన్-A , విటమిన్-K , విటమిన్-C, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం లతో పాటు పీచు పదార్థాలు మరియు యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.
వీటిలో విటమిన్-A అనేది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది.
క్యారెట్ వల్ల
కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ జ్యూస్‌లో
విటమిన్-C మరియు యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని
బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
2. వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థాలు ఉండటం వల్ల
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
3. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో మరియు ఆరోగ్యకరమైన
జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటి వంటి సమస్యలు
పరిష్కరిస్తుంది.
4. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
క్యారెట్ జ్యూస్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది,
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5. ఇందులోని విటమిన్ - ఎ కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో
కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారించడంలో
సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు లేని వారు కూడా
తప్పకుండా వీటిని తరచుగా తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు.
6. క్యారెట్ జ్యూస్‌లోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని
ఇస్తాయి. ఇది చక్కెర పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
7. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. క్యారెట్ జ్యూస్‌లో
కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
8. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి.
9. చర్మ సౌందర్యాన్ని మరియు ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తాయి. క్యారెట్ జ్యూస్‌లోని విటమిన్-A మరియు
యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలు,
నల్ల మచ్చలను,
కళ్లకింద నల్లని
వలయాలను తగ్గిస్తాయి.
క్యారెట్ రసంతో
సహజమైన ఫేస్ పాక్ ఎలా వేసుకోవాలి?
క్యారెట్లో
చర్మానికి మేలు చేసే విటమిన్ - ఎ అధికంగా ఉన్నందున దీనిని ఫేస్ ప్యాక్‌గా
ఉపయోగించవచ్చు.
✤ 1 లేదా 2
తాజా
క్యారెట్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసి మిక్సర్ లో వేసి చిక్కటి రసాన్ని
తీస్కోండి.
✤ ఈ రసాన్ని కాటన్ బాల్
లేదా మీ వేళ్లను ఉపయోగించి ముఖానికి ప్యాక్ లా పట్టించండి.
✤ సుమారు 15-20
నిమిషాల పాటు
వదిలివేయండి.
✤ గోరువెచ్చని నీటితో
బాగా శుభ్రం చేసుకోండి.
యాంటీ ఏజింగ్ : క్యారెట్ లోని విటమిన్
- A ముఖంపై ఉండే నల్లని మచ్చలు, వలయాలు మరియు ముడతలను
తగ్గించడంలో సహాయపడుతుంది.
కాంతివంతమైన
చర్మం : క్యారెట్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా కాంతివంతమైన
ఛాయతో తయారవుతుంది.
హైడ్రేటింగ్: క్యారెట్ జ్యూస్
సహజమైన మాయిశ్చరైజర్, చర్మం హైడ్రేట్ మరియు రిఫ్రెష్‌గా ఉంటుంది.
క్యారెట్లను
ఎలా తినాలి?
మనము విరివిగా
ఉపయోగించే చాలా కూరగాయల మాదిరిగానే, క్యారెట్‌లు కూడా
తక్కువ యాసిడ్ కలిగి ఉంటాయి. అందువల్ల చాలా తొందరగా కలుషితమయ్యే గుణాన్ని కలిగి,
బాక్టీరియా
వృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని శుభ్రంగా కడిగి,
చెక్కు తీసి,
ఉడికించిన
తర్వాత తినడమే ఆరోగ్యానికి మంచిది.