నిద్రలేమి సమస్యకు కారణాలు ఇవే!!!

 

What are the main causes of insomnia

నిద్రలేమి సమస్యను నివారించే పరిష్కారాలు

నిద్రలేమి ... నేడు చాలా సాధారణ ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు ఇది వయసు పెరిగిన వారిలో ఉండేది. నేడు వయసుతో సంబంధం లేకుండా చదువుకొనే పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు సాధారణమైన సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం 'ఒత్తిడి'. అది చదువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, అనారోగ్యం ... ఇలా చాలా విషయాల ప్రభావం నిద్రలేమికి దారితీస్తోంది.

నిద్రలేమి అంటే ... శరీరానికి సరిపడేటంత నిద్ర లేకపోవడం. కొంతమంది పడుకొన్న 2 - 3 గంటల వరకు నిద్రలోకి వెళ్ళరు. ఏవో ఆలోచనలు వారిని వేధిస్తూ ఉంటాయి. మరికొంత మంది నిద్రపోతుండగా మెలకువ వస్తే మళ్ళీ నిద్రపోవడానికి చాలా సమయం పడుతుంది. సమస్య తీవ్రమైన వాళ్ళు నిద్ర మాత్రలు వేసుకొంటే గాని నిద్రపోరు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా నిద్ర మాత్రలు అలవాటైతే వ్యసనంగా మారి అవి లేకపోతే నిద్రపోలేని స్థితికి చేరే ప్రమాదం ఉంది. ఈ నిద్రలేమికి అనేక విభిన్న కారణాలను నిపుణులు విశ్లేషించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి మరియు ఆందోళన: చదువు, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితులు తాత్కాలిక నిద్రలేమికి కారణం కావచ్చు. కొంతమందిలో ఈ సమస్యలు తీరగానే నిద్రలేమి సమస్య కనిపించదు. మరికొంత మందిలో దీర్ఘకాలిక ఆందోళన ఈ సమస్యను కష్టతరం చేస్తాయి.


చెడు నిద్ర అలవాట్లు: వేళకు నిద్రపోకపోవడం, పగటిపూట నిద్రపోవడం, నిద్రవేళలో మొబైల్, కంప్యూటర్ లేదా టి.వి. చూడటం, నిద్రకు ముందు కెఫీన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటివి నిద్రకు భంగం కలిగిస్తాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు నుండి వచ్చే నీలి కిరణాలు నిద్రను ప్రేరేపించే హార్మోన్లను ప్రభావితం చేసి నిద్రను పాడుచేస్తాయి.


ఆరోగ్య సమస్యలు: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, డిస్క్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బసం లేదా కీళ్ల వాతం వంటి రుగ్మతలు నిద్రలేమి కారణం అవుతాయి.


మందులు: ఆరోగ్య సమస్యల నివారణకు వాడే యాంటిడిప్రెసెంట్స్, బీటా-బ్లాకర్స్ మరియు కార్టికోస్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.


అసౌకర్య పర్యావరణం: వేడి లేదా చల్లటి గది లేదా అసౌకర్యమైన మంచం, పరుపు, ధ్వని లేదా వెలుతురు కూడా నిద్రకు అసౌకర్యంగా మారతాయి.


హార్మోన్ల మార్పులు: ఋతుస్రావం, గర్భం మరియు మెనోపాజ్‌తో సంబంధం ఉన్న హార్మోన్ల మార్పులు నిద్రకు భంగం కలిగిస్తాయి.


మానసిక ఆరోగ్య పరిస్థితులు: డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా నిద్రలేమికి కారణాలు.

సమర్థవంతంగా చికిత్స చేయడానికి నిద్రలేమికి మూలకారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు, జీవనశైలి మార్పులు నిద్రను మెరుగుపరచడానికి సరిపోతాయి. ఇతర సందర్భాల్లో, నిద్రలేమికి మూలకారణాన్ని పరిష్కరించడానికి వైద్య చికిత్స అవసరం కావచ్చు.


Post a Comment

Previous Post Next Post