ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం

 


తమిళనాట అగ్ర హీరోలలో ఒకరైన విజయ్, ఇళయ దళపతిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొని కొత్త పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తన పార్టీ పేరును 'తమిళగ వెట్రి కజగం' అని అధికారికంగా నామకరణం చేసినట్టుగా ప్రకటించారు.

రాజకీయరంగ ప్రవేశం చేయమని అభిమానులు ఎప్పటినుంచో విజయ్ ను కోరుతూ గతంలో బ్యానర్లు, పోస్టర్లు వేయించిన సంగతి తెలిసిందే.  అభిమానుల కోరిక మేరకు తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

పార్టీ రిజిస్ట్రేషన్ మరియు అధికారిక పనులను పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం చెన్నైలో పార్టీ యొక్క కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

విజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయ వ్యవహారాలపై చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించామని, పార్టీ ఇప్పుడే ప్రారంభమైనందున గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగవలసి ఉందని అందువల్లనే 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా నిర్ణయించినట్లుగా తెలిపారు.

అంతేకాక ప్రస్తుతానికి తాము పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, తమ అభిమానులుఅనుచరులు వారి వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


Post a Comment

Previous Post Next Post