అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను వయసు రీత్యా జ్ఞాపకశక్తి లోపించిందని, అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ విమర్శిస్తూ, ఉపాధ్యక్షురాలు కమల హారిస్ కు లేఖ పంపించారు.
ఇటీవల జరిగిన అనేక సమావేశాలు, బహిరంగ సభల్లో ఈయన జ్ఞాపకశక్తి లోపం స్పష్టంగా కనిపించింది అని, విదేశీ నేతల సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో అధ్యక్షుడు బైడెన్ గందరగోళానికి గురికావడానికి గుర్తుచేశారు. దేశానికి మానసికంగా దృఢమైన అధ్యక్షడు అవసరం అని పేర్కొన్నారు. తద్వారా అధ్యక్ష పదవి నుంచి కొనసాగడానికి ఆయన అనర్హులంటూ, 25వ సవరణ అమలు చేసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలహారిస్ కు లేఖ రాసారు.
ఈ 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు మానసికంగా గాని, శారీరకంగా గాని ఫిట్ గా లేరని ఉపాధ్యక్షులు మరియు ఇతర క్యాబినెట్ సభ్యులు భావిస్తే అధ్యక్షుడుని పదవి నుంచి తొలగించే అధికారం ఉందంటూ మోరిసే మరొకసారి గుర్తు చేశారు.