ఇజ్రాయెల్ పై బుధవారం లెబనాన్ కు చెందిన హెజబొల్లా చేసిన దాడికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ రెండు చోట్ల ప్రతి దాడులు చేసింది. నాబాతియే లోని ఒక భవనం పై చేసిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 7 గురు మరణించారు. సౌనే లో జరిపిన మరొక దాడిలో ఒక మహిళతో పాటు ఇద్దరు పిల్లలు మరణించారు. వీరితోపాటు హిజ్బుల్లా కమాండర్, మరో ఇద్దరు యోధులు మరణించారని భద్రతా వర్గాలు గురువారం తెలిపాయి.
ఇజ్రాయెల్ చేసిన దాడులకు నిరసనగా లెబనాన్ లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యలయాలు మూసివేశారు. మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజబొల్లా హెచ్చరిస్తోంది. గురువారం నాడు గాజా దక్షిణ ప్రాంతంలోని నాజర్ ఆసుపత్రిని ఇజ్రాయిల్ దళాలు చుట్టుముట్టాయి. అక్కడ తలదాచుకుంటున్న వేలాదిమందిని వెళ్లిపోమంటూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పులలో ఒక రోగి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం కారణంగా జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో ఉన్న పాలస్తీనియులకు తాము రక్షణ కల్పిస్తామని అమెరికా ప్రకటించింది. వారిని వెనక్కి పంపబోము అని స్పష్టం చేసింది. అధ్యక్షుడు నిర్ణయం మేరకు ఈ ప్రకటన చేసినట్టుగా తెలిపింది.