ప్రతీకార దాడులు మొదలుపెట్టిన అమెరికా, 18 మంది మృతి !

 


ఇటీవల జోర్డాన్లోని తమ సైనిక స్థావరాల పై డ్రోన్ తో దాడి చేసిన ఘటనకు, అమెరికా ప్రతీకార దాడులు చేస్తామని ముందుగానే ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విధంగానే ఇరాక్, సిరియాలలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ ప్రతీకార దాడులలో సుమారుగా 18 మంది వరకు మృతి చెందినట్లుగా యూకే లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంతకు ముందుగానే ప్రతీకార దాడులకు లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నామని ఒక ప్రణాళికతోనే దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నాటి డ్రోన్ దాడిలో మృతి చెందిన 3 సైనికుల కుటుంబాలను శుక్రవారం ఆయన పరామర్శించి ఆ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు. తాము ఎటువంటి ఘర్షణలను కోరుకోవడం లేదని, మా దేశానికి నష్టం కలిగించాలని చూస్తే మాత్రం దానికి కచ్చితంగా ప్రతిస్పందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. నా ఆదేశాలు ప్రకారం నిర్దేశించిన లక్ష్యాలపై ప్రతి దాడులు చేస్తాము అని హెచ్చరించారు.

దీనిలో భాగంగానే దాడులకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వానికి తాము ముందుగానే సమాచారం అందించినట్లుగా భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. సుమారు 85 స్థావరాల పై దాడులు చేసినట్లుగా యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది వీటిలో అధునాతన బాంబర్లు వైమానికి దాడిలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో తమ లక్ష్యాలపై మరిన్ని భయంకరమైన దాడులు ఉంటాయని కూడా హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post