నీరు అధికంగా తాగితే వచ్చే అనర్ధాలు మీకు తెలుసా?

 

Health problems with drinking binge water

నీరు ఎంత తాగాలి? ఎప్పుడు తాగాలి? ఎలా తాగాలి?


నీరు మనకు ప్రాణాధారం. నీరు లేనిదే మన జీవనం లేదు. మానవ శరీరంలో సుమారుగా 60 శాతం వరకు నీరు ఉంటుంది. మన జీవక్రియలు సజావుగా జరగడానికి నీరు చాలా ముఖ్యం. అందుకే నీరు బాగా తాగడం ఆరోగ్యానికి మంచిది అని వింటూ ఉంటాం. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు కూడా ఇదే కదా తరచూ సూచిస్తూ ఉంటారు. మరి నీరు అధికంగా తాగడం ఏమిటి అనుకుంటున్నారా? ... నిజమే నీరు ఎంత తాగుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. అధికంగా మరియు తరచుగా తాగితే ఏవేవి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తంలో నీటిని తాగడాన్ని "బింగే వాటర్ డ్రింకింగ్" లేదా "వాటర్ ఇంటాక్సికేషన్" అని పిలుస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.


1. హైపోనట్రేమియా: మీరు ఎక్కువ నీరు త్రాగినప్పుడు, అది మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను, ముఖ్యంగా సోడియంను పలుచన చేస్తుంది. ఈ పరిస్థితిని హైపోనాట్రేమియా అని పిలుస్తారు. ఇది వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛలు మరియు కోమా వంటి లక్షణాలను కలిగిస్తుంది.


2. మెదడు వాపు: మీ రక్తంలో సోడియం స్థాయిలు చాలా తక్కువగా పడిపోతే, అది మెదడు వాపుకు కారణమవుతుంది, ఇది గందరగోళ మానసిక స్థితి, మూర్ఛలు వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది.


3. వాటర్ పాయిజనింగ్: తక్కువ వ్యవధిలో ఎక్కువ నీరు తాగడం వల్ల వాటర్ పాయిజన్ ఏర్పడుతుంది, ఇది ప్రాణాంతకం కావచ్చు. నీటి విషం యొక్క లక్షణాలు తలనొప్పి, అలసట, వికారం, వాంతులు, తరచుగా మూత్రవిసర్జన మరియు తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు, కోమా మరియు మరణం కూడా సంభవించవచ్చు.


4. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత: అతిగా నీరు త్రాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది కండరాల తిమ్మిరి, బలహీనత మరియు క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది.
హైడ్రేటెడ్ గా ఉండటానికి తగినంత నీరు త్రాగటం చాలా అవసరం, కానీ పరిమితంగా త్రాగటం చాలా కీలకం. మీకు అధికంగా నీరు త్రాగే అలవాటు ఉండి, ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించండి.

ఎన్ని నీళ్లు తాగాలి?

రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యకరం. శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కాలాన్ని బట్టి కూడా నీరు తాగాల్సి ఉంటుంది. పగటిపూట ప్రతి గంటకు సుమారు 200 మి.లీ. వరకూ నీరు తాగవచ్చు.

ఎప్పుడు తాగాలి?
ఉదయం లేచిన తర్వాత పరగడుపున 2 నుండి 3 గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ మరియు అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ప్రేగులలో ఉండే మలినాలు శుభ్రం అవుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆహారం తింటూ మాత్రం నీరు తాగడం మంచిది కాదు. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన జఠర రసం పలుచబడి, అజీర్ణం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. భోజనానికి ఒక గంట ముందు వరకూ నీరు తాగవచ్చు, కానీ భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఇక రాత్రి విషయానికి వస్తే, రాత్రిపూట పడుకొనే ముందు ఒక గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

ఎలా తాగాలి?
నీరు ఎలా తాగాలి అనే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేసారు. అవి: నీరు ఎప్పుడూ నిలబడి తాగకూడదు, కూర్చుని నెమ్మదిగా కొంచెం కొంచెంగా తాగడం మంచిది. ఇలా తాగడం వల్ల ఈ నీరు లాలాజలంతో కలిసి జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం లేదా పదే పదే తాగడం కూడా మంచిది కాదు. వీటివల్ల వచ్చే సమస్యలను మనం పైన తెలుసుకున్నాం.

కావున మన శరీరం యొక్క తత్వం, నీటి అవసరం, కాలాన్ని బట్టి నీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post