ముఖాన్ని సహజ పద్దతిలో కాంతివంతం చేయడం ఎలా?

How can our face glow naturally?

 

కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి చిట్కాలు!!


మీ ముఖ కాంతిని సహజంగా మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

హైడ్రేట్: మీ చర్మాన్ని హైడ్రేట్ గా మరియు మెరిసేలా ఉంచడానికి, నీరు పుష్కలంగా తీసుకోండి. రోజుకు 8 గ్లాసులకు తగ్గకుండా నీటిని తాగాలి. వీటితో పాటు సీజనల్ గా లభించే పళ్ళు, పళ్ళ రసాలు తీసుకోవాలి.

నిద్ర: ఇది చాలా ముఖ్యమైన అంశం. మీ చర్మాన్ని పునరుద్ధరించడంలో తగినంత నిద్ర మరియు విశ్రాంతి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అధిక పని ఒత్తిడి, రాత్రిపూట పనివేళలు, రసాయన పూరిత ఆహారాలు, ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్ల వల్ల నిద్రలేమి సమస్యలు బాగా పెరిగాయి. సుమారు 7 నుండి 8 గంటల మంచి నిద్ర ఆరోగ్యకరం. రాత్రి పూట నిద్రకు గంట ముందుగానే మొబైల్, కంప్యూటర్ వాడటం ఆపివేయాలి. వాటి నుండి వెలువడే నీలి కిరణాలు నిద్రను ప్రేరేపించే హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి.

ఆహారం: చర్మానికి పోషణను అందించడానికి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. తాజా పళ్ళు, కూరగాయలు, డ్రై ఫ్రూప్ట్స్, నట్స్, ఖర్జూరం వంటివి తీసుకోవడం చాలా మంచిది.

వ్యాయామం: ప్రతిరోజూ కనీస వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వ్యాయామం వీలుకాని వాళ్ళు కనీసం ఒక అర గంటైనా నడవడం మంచిది. ఇది మీ శరీరానికే కాకుండా, చర్మానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది.

చర్మ సంరక్షణ: చర్మానికి హాని కలిగించే కఠినమైన రసాయనాలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను నివారించి, సహజ సిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.

సూర్యరశ్మి నుండి రక్షణ: సూర్యోదయం దాటిన తర్వాత నుండి క్రమ క్రమంగా సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాలు చర్మంపై ఉన్న కణాలకు ఎక్కువ హాని చేస్తాయి. వీటి నుండి కాపాడుకోవడానికి నూనె, బాడీ లోషన్ వంటివి వాడాలి. దుస్తులతో శరీరాన్ని వీలైనంతగా కవర్ చేసుకోవడం వల్ల కూడా ఎండ వేడి నుండి మరియు సన్ టాన్ నుండి కాపాడుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గించుకోవాలి: వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి తగ్గించుకోవాలి. వీటి కోసం ధ్యానం మరియు యోగా వంటి విధానాలను అలవాటు చేసుకోండి. కుటుంబంతో మరియు స్నేహితులతో సరదాగా గడపండి. అన్నింటికంటే ముఖ్యంగా మనకు మన అందంపై శ్రద్ధ ఉండాలి. అంతే కదా ... !

Post a Comment

Previous Post Next Post