చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం!

 

చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం

చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే దిశగా రష్యా చైనాతో సంప్రదింపులు జరిపి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మాస్కో అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ అధినేత 'యూరి బోరిసోవ్' ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో చంద్రునిపై ఆవాసాలు నిర్మించాలంటే సోలార్ ప్యానల్ తో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సరిపోదని దానికోసమే అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టేందుకు చైనాతో కలిసి పరిశీలనలు చేస్తున్నట్లుగా తెలిపారు. 

న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ లో మాస్కో సంపాదించిన నైపుణ్యం ఈ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. 2033-35 నాటికి ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చైనా తో కలిసి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని పూర్తిస్థాయి రోబోటిక్ టెక్నాలజీ తో పూర్తిచేసేందుకు సిద్ధం అవుతున్నట్టు గా తెలిపారు.

Post a Comment

Previous Post Next Post