వారంలో 36 గంటలు ఉపవాసం చేస్తున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్



ఉపవాసం చేయడమనేది ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే మనలో చాలామంది రోజులో ఒక పూట తినడం లేదా పూర్తిగా ఒక రోజంతా ఉపవాసం ఉండడం మనం చూస్తుంటాం. కానీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాత్రం వారంలో 36 గంటలు ఏకధాటిగా ఉపవాసం ఉంటారట.  ఈ విషయాన్ని ఆ దేశం స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి మంగళవారం ఉదయం 5 గంటల వరకు అంటే 36 గంటల పాటు ఉపవాసం చేస్తారట. ఈ ఉపవాసం చేసే సమయంలో కేవలం నీళ్లు మరియు టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతారట.

ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం మాత్రమే ఇటువంటి దీక్ష చేస్తున్నట్టుగా ఆయన స్థానిక మీడియాతో వెల్లడించినట్లుగా తెలిపారు. పదవీ బాధ్యతల రీత్యా వ్యాయామం చేయడానికి సమయం లేదని, ఈ ఉపవాసం ఆరోగ్యం పరంగా శరీరానికి ఒక రకమైన రీసెట్ లాంటిదని తెలిపారని మీడియా సంస్థ వెల్లడించింది.

ఉపవాసం చేయడమనేది చాలా ఆరోగ్యకరమైనదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే శరీరానికి అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోలా ఫాస్టింగ్ చేసే విధానం ఉంటుంది. ఉపవాసం చేసే సమయంలో డిహైడ్రేషన్ కు లోనను కాకుండా ఉండేందుకు చాలామంది తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. 

అయితే ఈ ఉపవాస సమయంలో మనకి కావలసిన శక్తి కోసం మనలో దాగి ఉన్న కొవ్వు నిల్వల నుండి శరీరం శక్తిని గ్రహిస్తుంది. తద్వారా శరీరంలోని అధిక కొవ్వు ను కరిగించి, శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. ఇది మన శరీరానికి మరింత ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని అందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post