విడాకుల వార్తలపై స్పందించిన సినీ నటి జ్యోతిక

 

తమిళ స్టార్ హీరో సూర్య, అతని భార్య జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలపై జ్యోతిక స్పందించారు. ఇటీవల జ్యోతిక చెన్నై నుండి తన పిల్లలతో మకాంను ముంబైకి మార్చడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయని దానివల్లనే విడాకులు తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు హంగామా చేశారు.

ఈ ఏడాది నూతన సంవత్సరం రోజున సూర్య ఒక్కరే తన అభిమానులకు శుభాకాంక్షలు తెలపడం ... సూర్య గాని, జ్యోతిక గాని దీనిపై స్పందించకపోవడంతో వీరిమధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా ట్రోల్ చేసారు.

తాజాగా విడాకుల విషయం పై జ్యోతిక స్పందించారు. తాను వరుసగా బాలీవుడ్ సినిమాలు కమిట్ అవ్వడం వలన మరియు పిల్లలకు చదువులు నేపథ్యంలోనూ ముంబైలో ఉంటున్నట్లుగా తెలిపారు. ఆమెకు, సూర్యతో ఎటువంటి విబేధాలు లేవని, కమిట్ అయిన సినిమాలు, పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి చెన్నై వెళ్తానని తెలిపారు. దీనితోపాటు వారిద్దరూ ఇటీవల ఫిన్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. దీంతో తనపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లందరికీ షాక్ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post