మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చు - ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరిక



రష్యా ఉక్రెన్ల మధ్య జరుగుతున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో, నిన్న ఆదివారం జర్మనీలో పర్యటించిన  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ తమకు అగ్రరాజ్యమైన అమెరికా సహా అనేక దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని, ఏ సమయంలో ఏమైనా జరగొచ్చు … అది మూడవ ప్రపంచం యుద్ధం అయినా కావొచ్చు అని హెచ్చరించారు.

ఒకవేళ రష్యా నాటో కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై దాడి చేసినా కూడా అది ప్రపంచ యుద్ధానికి నాంది గానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రష్యా ఉక్రెయిన్ ఆక్రమించాలని సిద్ధమైన సమయంలో జర్మనీ తనవంతు పాత్ర పోషించలేదని, అదేవిధంగా ఈ ఘర్షణల సందర్భంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.   మరొకవైపు అమెరికా ఉక్రెయిన్ కు అందించే ఆర్థిక సహాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Post a Comment

Previous Post Next Post