కొత్తిమీరతో
సౌందర్యం - ఆరోగ్యం !!!
కొత్తిమీర మన అందరికీ తెలిసిన సువాసన భరిత సంప్రదాయ భారతీయ వంట పదార్ధం.
ఇది ధనియాల నుంచి వచ్చే చిన్నమొక్క. చూడటానికి చిన్నదే అయినా మన ఆరోగ్య సంరక్షణలో
చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆహార పదార్థాల అలంకరణ (Garnish)
కు చివరగా వాడే
పదార్థాలలో ఒకటిగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఈ కొత్తిమీరలో ఎన్నో
విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి : విటమిన్ ఎ, విటమిన్ సి,
విటమిన్ కె,
బీటా-కెరోటిన్,
ఐరన్,
పొటాషియం,
కాల్షియం మరియు
మెగ్నీషియం మొదలైనవి. కొత్తిమీర మొక్క యొక్క ప్రతీ భాగం విలువైనదే. అనగా కాండం,
ఆకులు,
గింజలు అన్నీ
ఔషధ గుణాలు, సువాసన కలిగి ఉంటాయి.
అంతేకాకుండా ఇది
యాంటి బయాటిక్, యాంటి మైక్రోబియల్, యాంటి ఆక్సిడెంట్, యాంటి ఎపిలెప్టిక్ (మూర్ఛ నివారిణి), యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి డిప్రెసంట్, యాంటి హైపర్‌టెన్సివ్ (రక్తపోటు నివారిణి) మరియు మూత్రవిసర్జనకారి
లక్షణాలను కలిగిఉంది. ఈ ప్రయోజనాలను మరింత వివరంగా చూద్దాం.
✤ కొత్తిమీర ప్రేగులలో ఉండే అనేక హానికర బ్యాక్టీరియాలను తొలగించి ప్రేగులను శుభ్రపరచి కడుపు ఉబ్బరం మరియు ఫుడ్ ఫాయిజనింగ్ వంటి వాటిని నిరోధిస్తాయి.
✤ మనం నిరంతరం కలుషిత
వాతావరణం వల్ల అనేక విషవాయువుల బారిన పడుతూ ఉంటాం, వాటిని నిరోధించడానికి
శరీరం ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అవి దీర్ఘ కాలంలో మన శరీరంలో కాన్సర్
ను వృద్ధి చేయవచ్చు. కానీ కొత్తిమీరలో ఉండే అధిక యాంటిఆక్సిడెంట్ల వల్ల కాన్సర్
వ్యాధి రాకుండా నిరోదిస్తాయి.
✤ కొత్తిమీరలోని న్యూరో
ప్రొటెక్టీవ్ లక్షణాలు కణాలను రక్షించడమే కాక, దీనిలోని యాంటి
ఎపిలెప్టిక్ గుణాలు నాడీ వ్యవస్థపై పనిచేసి మూర్ఛ వ్యాధిని కూడా అదుపుచేస్తాయి.
✤ కొత్తిమీర రక్తంలో
నిల్వ ఉన్న LDL మరియు VLDL వంటి చెడు కొలెస్ట్రాల్ ను క్రమబద్ధీకరిస్తుంది.
ట్రైగ్లిజరైడ్లు తగ్గించడం ద్వారా గుండె సంభందిత వ్యాధులు తగ్గుతాయి.
✤ రక్తంలో చక్కెల
స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది.
✤ శరీరంలోని కొవ్వును కరిగించి
బరువు తగ్గేలా చేస్తుంది.
✤ రసాయనిక వ్యర్థాలను తొలగించి కాలేయం యొక్క సరైన పనితీరును మెరుగుపరుస్తుంది.
✤ కొత్తిమీరలో
మూత్రపిండాలను శుభ్రపరిచే గుణాలు ఉండడం వల్ల మంచి విసర్జణకారిగా పనిచేస్తుంది.
✤ దీనిలో విటమిన్-A
ఎక్కువగా ఉండటం
వల్ల కంటి సమస్యలు తగ్గి, చూపును మెరుగు పరుస్తుంది.
✤ కొత్తిమీర ఆరోగ్యానికి
మాత్రమే కాదు ... అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
కొత్తిమీరను
జ్యూస్ రూపంలో లోపలికీ మరియు ప్యాక్ రూపంలో చర్మ సౌదర్యానికి వాడవచ్చు. జ్యూస్ లా
తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కొత్తిమీర పేస్ట్ లేదా రసాన్ని ఉపయోగించి వేసే
కొన్ని ఫేస్ ప్యాక్స్ మొటిమలు, నల్లమచ్చలు వంటి సమస్యలు తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటి బాక్టీరియల్ మరియు
యాంటి ఫంగల్ లక్షణాలు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులతో పెదాలపై మర్దన
చేస్తే చాలా మృదువుగా, గులాబీ రంగులో అందంగా కనిపిస్తాయి. కొత్తిమీరలో విటమిన్-A
, విటమిన్-K
పుష్కలంగా ఉండటం
వల్ల ఈ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టు రాలడం తగ్గిస్తాయి. జుట్టును ఒత్తుగా,
బలంగా
మారుస్తాయి.