పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష !

 


పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు అప్పటి మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి కి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జనవరి 30, మంగళవారం నాడు స్పెషల్ కోర్ట్ ఈ శిక్షను ఖరారు చేసింది. 2022వ సంవత్సరంలో అమెరికాలోని పాకిస్తాన్ యొక్క దౌత్య కార్యాలయంలో ఒక రహస్య కేబుల్ ( సైఫర్ ) ను పాక్ ప్రభుత్వానికి పంపినట్లుగా ... దానిని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారు అనేది ఈ కేసు యొక్క ప్రధాన అభియోగం.

అధికారిక రహస్యాన్ని బహిర్గతం చేసిన అభియోగంపై పాకిస్తాన్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ - 1923, సెక్షన్ 5 కింద విచారణ చేపట్టి ఈ తీర్పును వెలువడించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మరియు మహమ్మద్ ఖురేషిలు ప్రస్తుతం రావల్పిండి అడియాల హై సెక్యూరిటీ కారాగారంలో ఉన్నారు.

దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్ లండన్ లోని కొందరు ప్రముఖులు పక్కా ప్రణాళికతో ఈ విచారణ నడిపించారని తెలిపారు. అయితే ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాది నయీమ్ పంజుతా సోషల్ మీడియాలో తాము ఈ కేసు యొక్క తీర్పును అంగీకరించబోమని, ఇది అక్రమం అని స్పందించారు.

పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలకు అతి తక్కువ రోజుల వ్యవధి ఉన్న సమయంలో ఇటువంటి తీర్పు వెలువడటం విశేషం.

 ఈ తీర్పు పై ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేయనున్నట్లుగా సమాచారం.


Post a Comment

Previous Post Next Post