సియోల్: ఉత్తర కొరియా, తన యొక్క పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈనెల 30 మంగళవారం (2200 GMT, సోమవారం) నాడు, ఉదయం 7 గంటల సమయంలో ఉత్తరకొరియా తన పశ్చిమ భూభాగంలోకి క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా ప్రకటించింది.ఇటువంటి కవ్వింపు చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే నెలలో ఇదే తరహాలో 14, 24, 28వ తేదీల్లో కూడా అనేక క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా వెల్లడించింది.
ఈ క్షిపణులను ప్రయోగం తీవ్ర ఉద్రిక్తతలను నెలకొల్పుతోంది. కాగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా కవ్వింపు చర్యల నేపథ్యంలో త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తన్నాయి.
Tags
international