మణిపూర్ లో రెండు
వర్గాలైన మైటీ, కుకీల మధ్య మరొకసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల నేపథ్యంలో కాల్పులలో ఇద్దరు మృతి చెందగా
పలువురు గాయపడ్డారు. గత సంవత్సరం మే లో మొదలైన ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న
సుదీర్ఘ ఘర్షణల వల్ల అనేక తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగానే
సుమారుగా 200 మంది వరకు చనిపోగా, కొన్ని వేల మంది గాయపడ్డారు. అనేకమంది వలస బాట
పట్టారు.
ఇటీవల ప్రశాంతంగా
ఉన్న మణిపూర్ లో నిన్న మంగళవారం జనవరి 30వ తేదీన మళ్లీ రెండు వర్గాల మధ్యన ఘర్షణలు
చెలరేగాయి. ఈ ఘర్షణలలో భాగంగా ఒక వర్గం వారు కాల్పులకు తెగబడగా ఇద్దరు మరణించారు, సుమారు 5 మంది
గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతల మధ్య కొంతమంది మహిళలు భయాందోళనలతో పరుగులు తీసిన దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘర్షణలపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ లో హింసకు ప్రేరేపిస్తున్న ఏడు సాయుధ గ్రూపులపై ఐదేళ్లపాటు నిషేధాన్ని కేంద్రం విధించింది. శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నా కూడా ఇటువంటి హింసాత్మక చర్యలు జరగడం ఆందోళనలకు గురిచేస్తుంది.