పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చాలా కష్టమే: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్


పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆ దేశ మాజీ ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉందని ద్రవ్యోల్బణాన్నిఅధికార ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందని, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెనుకబడి ఉందని తెలిపారు. మన దేశ ఆర్థిక కష్టాలకు పరాయి దేశాలైన భారత్ లేదా అమెరికా కారణం కాదని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని పిటిఐ పార్టీని తీవ్రంగా విమర్శించారు.

ఫిబ్రవరి 8వ తారీఖున ఎన్నికలు జరగనుండడంతో నవాజ్ షరీఫ్ ఒక ప్రకటన చేశారు తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వస్తే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ఉపాధి అవకాశాలు కల్పించి దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.

గతంలో కూడా షరీఫ్, పొరుగున ఉన్న దేశాలు చంద్రునిపై కాలుమోపి విజయ పతాకాలు ఎగురవేస్తుంటే, పాకిస్తాన్ మాత్రం భూమి మీదనే ఎదగలేకపోతుందని తనదైన శైలిలో స్పందించారు.


Post a Comment

Previous Post Next Post