భారత దేశం అధిక జనాభా గల దేశం కావడం వల్ల, విద్యుత్ వినియోగం కూడా చాలా అధికం. గృహ అవసరాలకు మాత్రమే కాకుండా వాణిజ్య అవసరాలకు కూడా విద్యుత్ చాలా కీలకం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం' ను ప్రారంభించబోతోంది. సుమారు సుమారు కోటి గృహాలపై సౌరఫలకాలు నిర్మించాలని నిర్ణయించినట్టుగా మోడీ తెలిపారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగం మరియు ఉత్పత్తి దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ప్రధానమంత్రి తెలిపారు.
అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగించుకున్న తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని అమలు చేయడానికి కీలక ప్రకటన చేశారు. దీనిలో భాగంగా సుమారు కోటిపై గృహాల పైకప్పులపై సౌర ఫలకాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం కోసం, మరియు విద్యుత్ ఉత్పత్తిలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రధాని మోడీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
శ్రీరాముడు ఒక మహాశక్తి అని, సూర్య వంశానికి చెందిన ఆయన ఈ పథకానికి స్ఫూర్తి అని తెలిపారు.
అర్హతలు:
ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఇంకా పూర్తి స్థాయిలో వెలువడలేదు. కింది అర్హతలు ఉండేందుకు అవకాశం ఉంది.
* దరఖాస్తు దారు దేశ పౌరసత్వం కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు ప్రభుత్వ సర్వీసులో ఉండరాదు.
* ఆదాయం పైన కూడా పరిమితి ఉండవచ్చు.
దరఖాస్తు చేయు విధానం:
దరఖాస్తు చేయుటకు ప్రభుత్వం ఒక నిర్దేశిత వెబ్సైట్ ను ప్రారంభించి అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది.