కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోలుపై నిషేధాన్ని మరో రెండు ఏళ్ళ పాటు పొడిగించిన ప్రభుత్వం

 


కెనడాలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరుగుదలతో కలత చెందుతున్న స్వదేశీయుల ఆందోళనల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. కెనడాలో ఉండే విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లపై నిషేధాన్ని మరొక రెండేళ్లపాటు పొడిగించింది. దీనిలో భాగంగానే జనవరి 1, 2025తో ముగుస్తున్న ఈ నిషేధాన్ని మరొక రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్టుగా ఆ దేశ డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ ప్రకటించారు.

విదేశీయుల రాకతో కెనడాలో నివాసాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అక్కడి సామాన్యులు ఆందోళనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వారు ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగిందని ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చారు. విదేశీయుల ఇళ్ల కొనుగోళ్ల కారణంగా హౌసింగ్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగి, స్వదేశంలోని  సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయని భావిస్తున్న కెనడా ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది.  

అంతేకాక విదేశీ విద్యార్థుల చదువులకు సంబందించి, స్టూడెంట్ పర్మిట్ల జారీపై కూడా  మరో రెండు సంవత్సరాల పాటు పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం గత నెలలోనే ప్రకటించింది.

Post a Comment

Previous Post Next Post