జాంబియా ను వణికిస్తున్న కలరా, అండగా నిలిచిన భారత్

 


సౌత్ సెంట్రల్ ఆఫ్రికాలోని జాంబియాలో కలరా వ్యాధి కలకలం సృష్టిస్తోంది. కరోనా తర్వాత, ముందెన్నడూ ఎరుగని రీతిలో జాంబియాలో కలరా వ్యాధి విజృంభిస్తోంది. మీడియా కథనాల ప్రకారం గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైన ఈ కలరా వ్యాధి ప్రభావం ఇప్పటికీ ఆ దేశాన్ని విడిచిపెట్టలేదు.  సుమారుగా 600 మంది ప్రాణాలు కోల్పోగా, 15 వేల మంది పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.

దేశంలోని మొత్తం పది ప్రావిన్స్ లకు గాను 9 ప్రావిన్స్ లలో ఈ వ్యాధి ప్రభలింది. చాలా చోట్ల తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.  మాస్ వ్యాక్సినేషన్ ద్వారా ప్రభుత్వం వ్యాధిని నిరోధించడానికి ఏర్పాట్లు చేసింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో విశ్రాంత వైద్య సిబ్బందిని కూడా సేవల్లోకి తీసుకొని సేవలు అందిస్తున్నారు. 

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ తనదైన రీతిలో ఆపన్న హస్తాన్ని అందించింది. వైద్య అవసరాల నిమిత్తం క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు నీటి శుద్ధి యంత్రాలను పంపించి తమ వంతు సహాయాన్ని అందిస్తోంది.

Post a Comment

Previous Post Next Post