పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మూడోసారి జైలు శిక్ష

 


ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా నిఖా చేసుకున్నారనే అభియోగంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మూడోసారి జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్యాలు వెల్లడి చేసిన కేసు మరియు అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు మరొకసారి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్(71), బుష్రా బీబీ(49) అనే వ్యక్తిని ఇస్లాం నిబంధనలను విరుద్ధంగా పెళ్లి చేసుకున్నట్టుగా ఆమె మాజీ భర్త ఫరీద్ కేసు పెట్టారు. అంతేకాక వీరిద్దరికీ ముందు నుంచే వివాహేతర సంబంధం కొనసాగిందని ఆమె మాజీ భర్త ఆరోపించారు.

ఈ కేసు విచారణ ఈయన శిక్ష అనుభవిస్తున్న రావల్పిండి లోని అడియాల జైలు ఆవరణలో ట్రయల్ కోర్టు విచారణ జరిపి, తీర్పు ప్రకటించింది. ఇమ్రాన్, బీబీ లకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షలు చొప్పున జరిమానా విధించింది.

పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలకు కేవలం కొద్దిరోజుల సమయంలోనే పార్టీ అధ్యక్షునిపై ఇటువంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడం పిటిఐ పార్టీకి పెద్ద సవాల్!

Post a Comment

Previous Post Next Post