కేవలం 10 నిముషాలు ... ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు
వాకింగ్ చేయడం ఆరోగ్యం అని విన్నాం కానీ ... ఈ రివర్స్ (వెనక్కి) వాకింగ్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ కథనం మీకోసమే!
పేరులో ఉన్నట్టుగానే రివర్స్ వాకింగ్ అంటే వెనుకకు నడవడం. ఇది మాములు వాకింగ్ చేసినంత సులువు కాదు ... అలానే ఎక్కువ సేపు చేయలేము కూడా. ఎందుకంటే దీనికి కాస్త ఏకాగ్రత కూడా అవసరం. అసలు ఈ రివర్స్ వాకింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ రివర్స్ వాకింగ్ వల్ల సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంలో మోకాలిపై తక్కువ ఒత్తిడి పడటం వల్ల కాళ్ళ కండరాలకు బలాన్ని ఇస్తుంది. గుండెకు రక్త ప్రసరం మెరుగవుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవడం వల్ల బరువు తగ్గి శరీరం ఫిట్ గా ఉంటుంది. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పులు మరియు వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. హ్యాపీ హార్మోన్స్ ను స్టిములేట్ చేసి మనల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడూ చేసే సాధారణ వాకింగ్ లో కొన్ని కండరాలకు నిర్ణీత కదలికలు ఉండవు. ఈ రివర్స్ వాకింగ్‌లో వాటికీ కదలికలు వచ్చి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వాకింగ్ లో కళ్ళు మరియు కాళ్ళు సమన్వయం చేసుకొని ఏకాగ్రత, ఆలోచనా శక్తి పెరుగుతుంది. తద్వారా మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
వృద్ధులు, గర్భిణులు ఈ రివర్స్ వాకింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి.