ఉత్తర పాకిస్తాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా, చౌద్వాన్ పోలీస్ స్టేషన్ పై ఫిబ్రవరి 5వ తారీఖున తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ పదిమంది వరకు పోలీసుల్ని ఈ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అనేక మంది గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసు చీఫ్ అక్తర్ హయత్ వెల్లడించారు.
ఈ దుర్ఘటనలో 10 మంది పోలీసులు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లుగా మీడియా వర్గాలు వెల్లడించాయి. సుమారుగా 30 మందికి పైగా ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించి, రెండున్నర గంటల పాటు గ్రైనేట్లతో మరియు కాల్పులతో తీవ్ర దాడులు చేశారు, తర్వాత పోలీసు భవనంలోకి ప్రవేశించి పోలీసులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు అయితే పాకిస్తాన్లో ఈనెల 8న సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ ఉగ్రదాడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.