నిద్రలేమికి పరిష్కారాలేంటి?

 

What are the best solutions for insomnia?

హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

నిద్రలేమి అనేది నేటితరంలో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఒత్తిడితో కూడిన జీవన శైలి వల్ల చిన్న వయసు నుండీ ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యకు కొన్ని తేలికైన పరిష్కారాలు తెలుసుకుందాం.

1. రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, మసాలా ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురై నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.

2. రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం గంట నుండి గంటన్నర సమయం వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

3. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఆ సమయానికి మన మెదడు నిద్రకు సంకేతాలు పంపుతుంది.

4. నిద్రకు ముందు కాఫీ, టీ, ఆల్కహాల్ వంటివి తాగకూడదు.

5. మొబైల్స్, కంప్యూటర్లు వంటి గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి.

6. నిద్రపోవడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.

7. బెడ్ రూంలో తక్కువ కాంతినిచ్చే బెడ్ లైట్స్ వేసుకోవాలి.

8. మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

9. శ్వాససంబంధమైన వ్యాయామాలైన ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల మంచి నిద్ర వశమవుతుంది.

10. పెరుగుని తీసుకోవడం త్వరగా నిద్రలోకి జారుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ రాత్రిపూట పెరుగు తింటే కొంతమందిలో జలుబు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శరీర తత్వాన్ని బట్టి పెరుగును వాడవచ్చు.

11. గోరువెచ్చని పాలు, తేనె తో కలిపి తీసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. తేనెలో ట్రిప్టోపాన్ మన శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి.

12. యాలకుల పొడి, బాదంతో కలిపి పాలు తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

13. గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని వాసన పీలుస్తూ ఉండటం వల్ల నిద్ర పడుతుంది.

14. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోరాదు. ఈ దిక్కుపై అయస్కాంత శక్తి వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గి నిద్ర సరిగా పట్టదు.

15. నిద్ర సమయంలో అధిక శబ్దాలు లేకుండా మంచి సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

16. చేతి మునివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

17. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవడం వల్ల కూడా నిద్ర పడుతుంది. వీలైతే అరికాళ్లకు ఆముదం / నువ్వుల నూనె / కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా మంచి నిద్ర పడుతుంది.


Post a Comment

Previous Post Next Post